Menu

గాజా మారణహోమానికి సహకరిస్తున్న మహీంద్రా గ్రూప్ ను బహిష్కరించండి

anadmin 2 days ago 0 40

గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గమైన దాడులకు, మారణహోమానికి సహకరిస్తున్న ఇండియాకు చెందిన మహీంద్రా గ్రూప్ ను బహిష్కరించాలని ప్రజా కార్యకర్త‌లు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు.
మహీంద్రా గ్రూప్ ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలకు డ్రోన్లు, సైబర్ భద్రతా మద్దతును అందిస్తోందని ఆరోపిస్తూ, ఢిల్లీ దరియాగంజ్‌లోని మహీంద్రా షోరూమ్ ముందు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా (IPSP) సంస్థ‌ ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించింది.

బహిష్కరణ, ఉపసంహరణ, ఆంక్షలు (బిడిఎస్) ఉద్యమంలో భాగంగా మహీంద్రా సంస్థను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చిన నిరసనకారులను మహీంద్రా అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపయ్యాక వారిని విడుదల చేశారు.
హైదరాబాద్, పూణే, ముంబై, చండీగఢ్, విజయవాడ, పాట్నా, విశాఖపట్నంలోని మహీంద్రా అవుట్‌లెట్‌ల వెలుపల ఇలాంటి నిరసనలు జరిగాయి.
గతంలో, ఇదే సంస్థ‌ టాటా జుడియో, రిలయన్స్ ట్రెండ్స్, మెక్‌డొనాల్డ్స్, ఇతర వాణిజ్య సంస్థల వెలుపల నిరసనలు నిర్వహించింది.

Maktoob Media సౌజన్యంతో…
తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad