భారత్ లో జరుగుతున్న ప్రజా యుద్దానికి సంఘీభావంగా, రాజ్యం చేస్తున్న కగార్ దాడిని ఖండిస్తూ అంతర్జాతీయ ప్రచారంలో భాగంగా ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో, జూలై 27 ఆదివారం భారత రాయబార కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కారులు పాలస్తీనాకు కూడా తమ మద్దతును ప్రకటించారు.


డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ లో, యాంటీ-ఇంపీరియలిస్ట్ యాక్షన్ అద్వర్యంలో భారతదేశంలో ప్రజాయుద్ధం, అణగారిన ప్రజలు, కులాలపై అణచివేత గురించి ఒక చిత్ర ప్రదర్శన కార్యక్రమం జరిగింది.

ఫ్రాన్స్‌లో, యాంటీ-ఇంపీరియలిస్ట్ లీగ్ (LAI) భారతదేశంలో ప్రజాయుద్ధానికి మద్దతు ఇస్తూ, ఆపరేషన్ కాగర్‌ను ఖండిస్తూ ప్రజలు స్ట్రాస్‌బోర్గ్‌లో పోస్టర్లను ప్రదర్శించారు.
స్పానిష్ రాష్ట్రంలోని వాలెన్సియాలో, స్థానిక విప్లవ కమిటీ, భారతదేశంలో ప్రజా యుద్ధంపై నివేదిక ప్రచురించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారతదేశంలో విప్లవం మూలాలు, అభివృద్ధి గురించి, కామ్రేడ్ తో సహా 27 మంది విప్లవకారుల బలిదానం గురించి వక్తలు ప్రసంగించారు.
పోర్చుగల్లోని సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్థ (AAI) లిస్బన్‌లో పోర్చుగీస్ , కాబోవర్డే భాషలో పోస్టర్లను ప్రదర్శించింది. భారతదేశంలో ప్రజా యుద్ధానికి, అమరులైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజ్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కి చెందిన 27 మంది పోరాట యోధులకు పోస్టర్లలో రెడ్ శెల్యూట్స్ తెలిపారు . ఆపరేషన్ “కాగర్” ను ఖండించారు.

