కేరళకు చెందిన జర్నలిస్టు రెజాజ్ అతని స్నేహితురాలు ఇషాలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న జర్నలిస్టులకు సంఘీభావంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారిని మే 7వ తేదీన మహారాష్ట్రలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును ఖండిస్తూ డెమాక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటన
కార్యకర్తలను వెంటాడి వేధించడాన్ని ఆపండి
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో , “క్యాంపెయిన్ ఎగైనెస్ట్ స్టేట్ రిప్రెషన్” అనే సంస్థ జైలు శిక్షఅనుభవిస్తున్న జర్నలిస్టులందరికీ సంఘీభావంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కేరళకు చెందిన జర్నలిస్టు రెజాజ్ కేరళకు తిరిగి వెళుతుండగా ఆయనను అతని స్నేహితురాలు ఇషాను ఆమె ఇంట్లో నిన్న (మే 7న) లకాడ్‌గంజ్ (మహారాష్ట్ర) పోలీసులు అరెస్టు చేశారు. వారిపై సెక్షన్ 149, 192, 351(1)(b), 352(3), 353(3) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు..
పహల్గామ్ దాడి, దాని ఫలితంగా జరిగిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, కశ్మీర్‌లో ‘ఇజ్రాయెల్ నమూనా పరిష్కారం’ అమలుచేయాలనే డిమాండ్‌ను విమర్శిస్తూ కామ్రేడ్ రెజాజ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయం రాశారు. ఫ్రెండ్స్ ఆఫ్ పాలస్తీనా (పాలస్తీనా స్నేహితులు) “స్నేహంగా ఉండటం నేరం కాదు” అనే శీర్షికతో ఏర్పాటు చేసిన సంఘీభావ సమావేశనిర్వాహకులలో ఆయన ఒకరు. ఈ సందర్భంలో కామ్రేడ్ రెజాజ్‌తో సహా సంఘీభావ సమావేశనిర్వాహకులైన 8 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. కశ్మీర్ సమస్యల గురించి మాట్లాడటం, కశ్మీర్‌కు సంబంధించిన అంశాలను లేవనెత్తడం నేరం కాదు. నేరం కాకూడదు! కామ్రేడ్ రెజాజ్, ఇషాలను వెంటనే విడుదల చేయాలి
డెమాక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ (DSU)