Menu

అన్నంలో విషం కలిపి, చిత్రహింసలు పెట్టి ఆ ఏడుగురిని చంపేశారా ?

anadmin 8 months ago 1 785

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల కాలంలో ఇప్పటికే 16 మంది ఎన్ కౌంటర్ పేరుతో చంపేశారు. ఇవన్నీ బూటకపు ఎన్ కౌంటర్లే. ఇది ఎన్ కౌంటర్ ప్రభుత్వమా! లేదా ప్రజాస్వామిక‌ ప్రభుత్వమా ప్రజలందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ములుగులో జరిగిన ఎన్ కౌంటర్ కూడా మాకు పలు విధాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పోలీసుల్లో ఒక్కరికి కూడా గాయాలు కాలేదు. అక్కడ పరిసరాల్లో ఎలాంటి ఎన్ కౌంటర్ జరికినట్టు దాఖలాలు లేవు. మావోయిస్టుల‌ అన్నంలో విషం పెట్టి స్పృహ తప్పిపోయిన తర్వాత చిత్రహింస‌లు పెట్టి, ఎన్ కౌంటర్ పేరుతో తుపాకులతో కాల్చి చంపినట్లుగా స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు కాబట్టి చనిపోయిన మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలి. ఎన్ కౌంటర్ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.

ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో మళ్లీ ఎన్ కౌంటర్ తెలంగాణగా మార్చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర హోమ్ మినిస్టర్ ను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు వేయాలని కోరడం, ఆపరేషన్ కగార్ ను తెలంగాణలో అమలుపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బంధాలను అమలు పరుస్తూ ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చి చంపడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏటూరునాగారం ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది

ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్
అధ్యక్షుడు
పౌర హక్కుల సంఘం
తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఎన్ నారాయణరావు
ప్రధాన కార్యదర్శి
పౌర హక్కుల సంఘం
తెలంగాణ రాష్ట్ర కమిటీ
హైదరాబాద్
డిసెంబర్ 1
2024

Written By

1 Comment

1 Comment

  1. మా సత్యం
    ప్రభుత్వం అంటేనే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం
    కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏ పార్టీ వచ్చిన రాజ్యం యొక్క క్రూర స్వభావం, దోపిడిఎప్పుడు మారదు. అందులో భాగంగానే భారత సర్వోన్నత న్యాయస్థానం దగ్గర నుండి కిందిస్థాయి రాష్ట్ర హైకోర్టుల వరకు వాళ్లకి అనుగుణంగానే పనిచేస్తున్నాయి పనిచేస్తాయి.
    కనక చర్యకు ప్రతి చర్య సమాధానం కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad