Menu

రెండు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

anadmin 1 year ago 0 122

దామరతోగులో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూలై 29న ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల బంద్‌కు సీపీఐ (మావోయిస్ట్) పిలుపునిచ్చింది.

పోలీసులు చుట్టుముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపారని సీపీఐ (మావోయిస్ట్) జయశంకర్ భూపాలపల్లి-మహబూబాబాద్-వరంగల్-పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. దామరతోగు-రంగాపురం అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం మావోయిస్టు దళం పై పోలీసులు జరిపిన ఏకపక్ష కాల్పుల్లో కామ్రేడ్ నల్లమారి అశోక్ (విజేందర్) అమరుడయ్యాడని వెంకటేష్ తెలిపారు.

‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు అటవీ ప్రాంతాల్లో డ్రోన్‌ నిఘా, సెర్చ్‌ ఆపరేషన్లు పెంచడంతో పాటు పౌరహక్కుల కార్యకర్తలు, ప్రజాఉద్యమ నాయకులను బెదిరింపులకు గురిచేస్తోంది’ అని వెంకటేష్ మండిపడ్డారు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad