Menu

రేవంత్ సర్కార్ బూటకపు ఎన్ కౌంటర్లపై మావోయిస్టుల ఆగ్రహం

anadmin 1 year ago 0 176

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మరణించినట్తు పోలీసులు ప్రకటించారు. దీనిఅపి మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ రిలీజ్ చేసిన ప్రకటన పూర్తి పాఠం…

దామరతోగు ఎన్కౌంటర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్.ఎల్.ఏలు పూర్తి బాధ్యత వహించాలి!
ఎన్కౌంటర్లన్ని ప్రభుత్వ హత్యలే.
పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఎన్కౌంటర్లను వెంటనే ఆపివేయాలి!

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై మావోయిస్టు పార్టీ నిర్మూలనకై కగార్ దాడిని తీవ్రతరం చేస్తూ నిరంతరం పోలీసులతో అడవులను జల్లెడ పడుతున్నాడు.తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో బూటకపు ఎన్కౌంటర్లు, ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజల కోసం పని చేస్తున్న విప్లవకారులను హత్యలు చేస్తున్నది.
తెలంగాణలోని గుండాల మండలం, దామరతోగు అటవి ప్రాంతంలో గురవారం ఉదయం 6 గంటలకు జరిగిన ఎన్కౌంటర్ లో ములుగు జిల్లా, బుద్దారం గ్రామం కామ్రేడ్ నల్లమూరి అశోక్ అలియాస్ విజేందర్ (34) అమరుడయ్యాడు.
ఈ ఎన్కౌంటర్ ను ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించు కుంటుంది. విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు, కవులు, కళాకారులు ఈ ఎన్కౌంటర్ ను నిరసించండి.
ఆజాద్,
కార్యదర్శి.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad