స్మార కోపన్యాసం
“2024 ఎన్నికల ఫలితాలు – ఓ అవగాహన”
వక్త: కే శ్రీనివాస్
ఆంధ్రజ్యోతి సంపాదకులు
“భారత దేశం – ప్రజా స్వామ్యం”
వక్త:సి ఎస్ ఆర్ ప్రసాద్
విరసం
……………………………….
వేదిక: ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్. (60 ఫీట్ ఎక్స్టెన్షన్ రోడ్ ముత్యాలమ్మ గుడి దగ్గర న్యూ కలెక్టరేట్ రోడ్) సూర్యాపేట
తేదీ: జూన్23,2024
ఆదివారం,సమయం.ఉదయం. 10గంటలు.
………. ………… ………
“అమరుల కన్నుల్లో వేలవెన్నెల కాంతులు …… ప్రజలదే తుది విజయమనే
కలచెదరని చూపులు…”
కా.వివేక్, కా.కమల, కా. జోగి అమరులై అప్పుడే 9సంత్సరాలకాలం గడిచిపోయింది. ఉబికి వస్తున్న కన్నీరు,కన్నీటి తెరవెనుక ఆ అమరుల ప్రతిబింబాలు.
ఆధిపత్యం, పీడనలేని నూతన సమాజంకోసం ఎందరో అమరుల స్వప్నాల సాకారం దిశగా త్యాగాల బాటన నడిచిన విప్లవ తేజం కామ్రేడ్ వివేక్. విద్యార్థి ఉద్యమాల్లో అలుపెరుగని పోరు బాట తనది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారుడు. మూడు లక్షలకు పైగా ఆదివాసులను నిరాశ్రయులను చేసే పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు జరిగిన అనేక పోరాటాల్లో…పాదయాత్ర, ధర్నాలు, సభలు, సమావేశాలు అన్నిటిలో తానై ఆదివాసీల హృదయాలకు దగ్గరైన పోరు కెరటం వివేక్.
అసమ సమాజంనుండి సమసమాజం వైపుకు…. సాగిన పోరులో ప్రాణత్యాగం చేసిన అమరుడు కామ్రేడ్ వివేక్.
సమాజం అంటే కొన్ని రాజకీయ సూత్రాలతో నడుస్తుంది కొన్ని ప్రకటిత రాజకీయాలు ఉంటాయి .కొన్ని సమాజపు అంతస్సూత్రంగా నడిచే రాజకీయాలు ఉంటాయి. సమాజపు శాస్త్రీయ భావనల అవగాహన సామాన్యులకు ఉండకపోవచ్చు.ఇవి ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి .వీటి పట్ల ఎరుక కలిగి ఉండటం ప్రతి మనిషికి అవసరం.
కామ్రేడ్ వివేక్ అమరత్వం గురించి తెలుసుకోవడం మానవీయ సమాజపు ఎరుకను కలుగ చేయడమే కాక సమాజంలో మనిషి ఔన్నత్యపు దశలకు ఏ ధోరణులు అవరోధంగా ఉంటున్నది అవగతం అవుతుంది. ఈ అవగాహనలో భాగంగా జరుగుతున్న సంభాషణలో భాగం కావడం కోసం విప్లవ స్వాప్నికుడు అమరుడు కామ్రేడ్ వివేక్ తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభలో నేడు భారత దేశంలో పాలకుల విధానాలు, ప్రజల జీవితాలపై వాటి ప్రభావాలను చర్చించుకుందాం.ఒక మానవీయ సమాజం కోసం మనం నెరవేర్చ వలసిన కర్తవ్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుదాం.
ఈ సందర్భంగా “2024 ఎన్నికలు – ఓ అవగాహన అనే విషయం పై ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు కే.శ్రీనివాస్ మరియు భారత దేశం – ప్రజా స్వామ్యం అనే అంశం పై సి ఎస్ ఆర్ ప్రసాద్ విరసం బాధ్యులు
స్మారకోపన్యాసం చేస్తారు. ప్రజా సంఘాల బాధ్యులు వివేక్ సంస్మరణ సందేశాలిస్తారు.
ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే.
మీ యోగానంద్ ,మాధవి