ఢిల్లీ పోలీసులు కార్యకర్తలను అక్రమంగా కిడ్నాప్ చేయడం మరియు నిర్బంధించడాన్ని ఖండించండి!
రాజధానిలో రాజ్యాంగ వ్యవస్థ తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఢిల్లీ పోలీసులు విద్యార్థి కార్యకర్తలను, ప్రజాస్వామ్య స్వరాలను అక్రమంగా కిడ్నాప్ చేయడం, నిర్బంధించడం రాజ్యా అణచివేతకు ఒక ప్రమాదకరమైన కొత్త ఉదాహరణ.ఈ చర్యలు పౌర స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు భంగకరమైనవి.
మేము ఈ క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సంఘటనలపై తక్షణం విచారణ జరపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
జూలై 9 నుండి జూలై 12 వరకు, ఢిల్లీ పోలీసులు మనువాద, మతతత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తున్న అనేక మంది వ్యక్తులను చట్టవిరుద్ధంగా నిర్బంధించారు.
నిర్బంధించబడిన వారిలో డెమోక్రటిక్ రైట్స్ కార్యకర్తలు ఎహ్ తమామ్మ్ , బాదల్ (కార్పొరేషన్ & మిలిటరైజేషన్‌కు వ్యతిరేకంగా ఫోరం), విద్యార్థులు గుర్కీరత్, గౌరవ్ , గౌరంగ్ (భగత్ సింగ్ స్టూడెంట్ యూనిటీ ఫోరం), వలరిక (నజారియా మ్యాగజైన్) , సామాజిక కార్యకర్త సామ్రాట్ సింగ్ ఉన్నారు.
వారిని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో అరెస్టు వారెంట్ లేకుండా ఉంచారు. బంధువులను లేదా న్యాయవాదులను కలవడానికి అనుమతించ లేదు. ఏ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. ఇవి అన్ని చట్టపరమైన విధానాలను స్పష్టంగా ఉల్లంఘించడం.వారరందరినీ పోలీసులు అమానుషమైన, అనాగరికమైన హింసల పాలు చేశారు. నివేదికల ప్రకారం, వారిని నగ్నంగా, కరెంట్ షాక్ ఇచ్చి, కొట్టి, అవమానించారు.
వారి తలలను టాయిలెట్‌లో ముంచి, మహిళా కార్యకర్తలను లైంగిక హింసకు గురిచేస్తామని బెదిరించారు.
మరో వైపు జాకీర్ హుస్సేన్ కళాశాల (ఢిల్లీ విశ్వవిద్యాలయం)లో తత్వశాస్త్ర విద్యార్థి రుద్ర జూలై 19 ఉదయం నుండి కనిపించకుండా పోయారని మాకు సమాచారం అందింది.
రుద్రను కూడా ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కూడా కిడ్నాప్ చేసి చిత్రహింసలపాలు చేస్తున్నట్టు మేము అనుమానిస్తున్నాము. ఇది రాజ్య అణిచివేత యొక్క విస్తృత వ్యూహంలో భాగం.
ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా, వారిపై అర్బన్ నక్సల్ గా ముద్ర వేసి అన్ని ప్రజాస్వామ్య విభేదాలను అణిచివేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నది.
గత సంవత్సరాల్లో ఈ బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలో ఉన్న ప్రభుత్వం జామియా మిలియా ఇస్లామియా నుండి జెఎన్‌యు వరకు విద్యార్థుల గొంతులను ఎలా క్రూరంగా అణచివేసిందో మనం చూశాము.
హోంమంత్రి అమిత్ షా ప్రత్యక్ష నియంత్రణలో పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై దాడి చేయడం కొత్త కాదు. కానీ ఇటీవలి ప్రభుత్వపు క్రూరమైన హింస అన్ని పరిమితులను దాటిపోయింది.
కిడ్నాప్ చేయబడిన, వేధించబడిన కార్యకర్తలకు మేము మా అచంచలమైన సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాము.
ఈ చట్టవిరుద్ధ కిడ్నాప్, నిర్బంధంపై ఉన్నత స్థాయి, స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని, ఈ చర్యలకు కారణమైన ఢిల్లీ పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
ప్రజాస్వామ్య అసమ్మతిని అణిచివేయడానికి రాజ్య యంత్రాంగం దుర్వినియోగాన్ని నిరోధించాలి.
విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారిని శత్రువులుగా చూస్తున్న ఈ అణచివేత వ్యవస్థకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని మేము అన్ని పౌర సంస్థలు, ప్రజాస్వామ్య సమూహాలు, ప్రగతిశీల వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇది కేవలం వ్యక్తిగత అరెస్టుల విషయం కాదు, ఇది అసమ్మతి హక్కు, సంఘటిత హక్కు,న్యాయమైన భవిష్యత్తును ఊహించుకునే హక్కు కోసం పోరాటం.
AISF – AISA – BAPSA – COLLECTIVE – CRJD – PDSU – PSA – SFI