(అమరుడు కామ్రేడ్ గాజర్ల రవి @ గణేష్, @ఉదయ్ మీద మిత్ర రాసిన పాట)
పల్లవి:
త్యాగాల నెత్తుటి ముద్దయి
తరలీ వస్తుండో గణేష్-తరలీ వస్తుండో
బానిసత్వమును తరిమే పోరును
తోడుగా తెస్తుండో గణేష్-తోడుగా తెస్తుండో
తిరుగుబాటునే తెస్తుండో
వెలిశాలకే వస్తుండో
||త్యాగాల||
1)
దిద్దాలమ్మ ఇంటికొక్కరు
వీర తిలకమే దిద్దాలో – ||వీ||
ఇయ్యాలమ్మ ఎన్నెల కాంతులు
హారతిగానే ఇయ్యాలో – ||హ||
ఊరంతా తల్లిదండ్రులై
సల్లని దీవెనలియ్యాలో- ||స||
యువతీ యువకులు పిడికిల్లెత్తి
వీరంగమే ఆడాలో – ||వీ||
కగార్ దాడులు ఆపేదాకా
కలిసి పోరు జెయ్యాలో
||త్యాగాల||
2)
ఉదయించేది రవికిరణమే
విప్లవ స్వాగతమివ్వాలో ||వి||
ప్రజల కొరకే ప్రాణమిస్తామని
ఊరుకొక్కరు పుట్టాలో
సావులేని నీ ఆశయాలకు
నిత్య యవ్వనం ఉండాలో
మీ ఇంట్లో ఇద్దరూ లోకాన ఎందరు అమరులయ్యిరని చాటాలో
ఆ కాకమ్మ నీకెదురుగ వచ్చీ
కావు కావుమని పిలవాలో
||త్యాగాల||
3)
నిను సాదిన దండాకారణ్యం
గండాలెదురుకుంటుందో
నువు దాటిన నదులు సుడులై తిరిగి
నెత్తురు టేరులు పారాయో
మిము దల్సుకోని పక్షులన్నీ
వెక్కివెక్కి ఏడ్సినాయో
ఆ గోతికాడి గుంటనక్కలు
ఉల వెడుతూ వస్తుంటే
ఆ రేలా పూలు రాలిపడుతూ
మెడలో దండాలైనాయో
ఎర్ర పూల దండాలైనాయో
గోగుపుల దండాలైనాయో
(మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, 2004 శాంతి చర్చల ప్రతినిధి కామ్రేడ్ గణేష్ స్మృతిలో.. ఆయన పార్థివ దేహం వెలిశాలకు వస్తున్న సందర్భంగా..) 18-06-2025