Menu

నంబళ్ళ కేశవరావు హత్యకు నిరసనగా నేపాల్ లో ప్రదర్శన, సభ‌

anadmin 2 months ago 0 212

చత్తీస్ గడ్ లోని గుండే కోట్ లో CPI(మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశ్వరావు ఎలియాస్ బసవరాజ్ తో సహా 28 మంది విప్లవకారులను పోలీసు బలగాలు దారుణంగా హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్‌లోని రెండు కమ్యూనిస్ట్ విప్లవ పార్టీలు నేపాల్ రాజధాని ఖాట్మండులో నిరసన ప్రదర్శన, సభ నిర్వహించాయి.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మెజార్టీ), సైంటిఫిక్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజ్, అతని సహచర‌ విప్లవకారులను హత్య చేసిన‌ భారతదేశంలోని ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమంలో వక్తలు తీవ్రంగా విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా విప్లవోధ్యమాన్ని రక్షించడానికి, ముందుకు తీసుకెళ్లడానికి అంతర్జాతీయ ఫ్రంట్ యొక్క తక్షణ అవసరాన్ని వారు నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో:
కామ్రేడ్ ధర్మేంద్ర బస్తోలా ‘కాంచన్’ – జనరల్ సెక్రటరీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మెజారిటీ)
కామ్రేడ్ అహుతి – జనరల్ సెక్రటరీ, సైంటిఫిక్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, నేపాల్
కోలిన్ గోన్సాల్వ్స్ – సీనియర్ అడ్వకేట్, భారత సుప్రీంకోర్టు
మహాదీప్ పోఖారెల్ – వామపక్ష మేధావి,
కైలాష్ రాయ్ – రచయిత.
భారత ప్రజలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫాసిస్ట్ అణచివేతను వక్తలు తీవ్రంగా ఖండించారు. దీనిపై అంతర్జాతీయ విప్లకారుల‌ ఐక్యత, ప్రతిఘటనకు పిలుపునిచ్చారు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad