Menu

నంబళ్ళ కేశవరావు సహా,మావోయిస్టులను హత్య చేయడాన్ని ఖండిస్తున్నాం – శాంతి సమన్వయ కమిటీ

anadmin 2 months ago 0 297

జాతీయ శాంతి సమన్వయ కమిటీ (కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్) విడుదల చేసిన ప్రకటన:

నారాయణ్ పూర్లో CPI (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి సహా 27 మంది సాయుధ మావోయిస్టుల‌ హత్యను ఖండించండి!
ప్రభుత్వం మరియు CPI (మావోయిస్ట్) మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చలు తక్షణమే
ప్రారంభించాలి!

మే 21న, వార్తా నివేదికల ప్రకారం, సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాజీ మావోయిస్టులు మరియు స్థానిక యువకులతో ఏర్పాటైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు (DRG) చేపట్టిన ఎదురుకాల్పుల్లో CPI (మావోయిస్ట్) కు చెందిన 27 మందికి పైగా సాయుధులు మరణించారు. ఈ ఆపరేషన్లో ఒక DRG జవాన్ మరణించగా, పలువురు గాయపడ్డారు. ప్రధానంగా మీడియా చూపిస్తున్నది CPI (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి బసవరాజ్ అలియాస్ నంబాల కేశవ్ రావు హత్య. ఈ హత్యను ప్రభుత్వం, మీడియా మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా, ప్రభుత్వ సైనిక శక్తి విజయంగా ప్రకటిస్తూ, శాంతి చర్చల అవసరాన్ని కొట్టిపారేస్తున్నాయి.

ఈ చర్యకు ముందు ఇటీవల కర్రెగుట్టల్లో “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్” పేరుతో పోలీసు బలగాలు దాడులు చేశాయి. అక్కడ కూడా సాయుధుల కంటే గ్రామస్థులే ఎక్కువగా హతమయ్యారా అన్న అనుమానాలు, మృతదేహాల అప్పగింత‌లో ఆలస్యం, గ్రేహౌండ్స్ మరియు CRPF మధ్య తలెత్తిన కాల్పుల ఆరోపణలు అనేక ప్రశ్నలు రేపుతున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వాధినేతల పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఈ సమన్వయ లోపం బయటపడింది. ఈ ఆపరేషన్లో 31 మంది మరణించగా, వారిలో కొంతమంది గ్రామస్తులు, కొంతమంది బాలురు అనే అనుమానాల నేపథ్యంలో సమన్వయ కమిటీ ఫర్ పీస్ (CCP) నిష్పక్షపాత దర్యాప్తును డిమాండ్ చేసింది.

మీడియా ఈ ఘటనను ఘనవిజయంగా ప్రకటిస్తుండగా, మరణించిన‌ వారి ఖచ్చిత సంఖ్య ఇంకా స్పష్టంగా తేలలేదు. బసవరాజ్ హత్యకు గాను 1 కోట్ల నుండి 20 కోట్ల వరకు బహుమతి ఉండొచ్చని మీడియా ఊహిస్తోంది. అయితే ఈ వాతావరణంలో ప్రభుత్వం, CPI (మావోయిస్ట్) మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశం పూర్తిగా పక్కకు పోయింది. ఇటీవల ఛత్తీస్ గ‌ఢ్ ఉపముఖ్యమంత్రి శాంతి చర్చల అవసరాన్ని నొక్కి చెప్పారు, కానీ ఈ ఆపరేషన్లు ఆయన మాటలను ఖండిస్తున్నాయి.

ప్రభుత్వం నిజంగా శాంతికి కట్టుబడి ఉంటే, కాల్పుల విరమణ ప్రకటించి, చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
లేదా పారామిలిటరీ దళాలు, ఆధునిక ఆయుధాలతో ఈ విధమైన ఆపరేషన్లను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, ఇది అంతర్యుద్ధమని ప్రభుత్వం అంగీకరించాలి.

అలా అయితే భారత ప్రభుత్వం ‘ ఒప్పందాలు – నాన్ ఇంటర్నేషనల్ ఆర్మ్ కాప్లిక్ట్ (NIAC)” ప్రామాణికాలను పాటించాలి. ఇందులో హత్యల కంటే అరెస్టులకు ప్రాధాన్యం ఉండాలి. చిత్రహింసలు పెట్టడం, నిర్బంధించడం, వ్యక్తుల గౌరవ మర్యాదలకు భంగం కలిగించటం, మృతదేహాల పట్ల అవమాన కరంగా వ్యవహరించటం వంటి చర్యలను నిషేధించాలి.

భారత హోం మంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యం కేవలం హత్యల ద్వారానే సాధ్యమవుతుందని భావిస్తున్నారు. కానీ మావోయిస్టులు లేవనెత్తిన సమస్యలు, ఏ రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు ఈ సుదీర్ఘ సాయుధ పోరాటానికి కారణమయ్యాయో అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. మధ్య భారతంలోనూ ఇతర ప్రాంతాలలోనూ అత్యంత వెనుకబడి ఉన్న ప్రజల పై జరుగుతున్న దోపిడీ, అసమానతలు లేవనెత్తుతున్న ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి. హత్యలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయా, సుదీర్ఘ సాయుధ పోరాటానికి దారి తీసిన రాజకీయ భావాలు నశించి పోతాయా అని ప్రశ్నించుకోవలసిన అవసరం కూడా ఉంది.

మేము — శాంతికి కట్టుబడినవారం – భిన్నమైన వైఖరిని అవలబించవలసిందని కోరుతున్నాము. సాయుధ బలగాలు చర్చలకు సిద్ధపడాల్సి ఉంది. CPI (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శితో సహా పలువురిని హత్య చేయడాన్ని శాంతి సమన్వయ కమిటీ (CCP) తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రభుత్వం మావోయిస్టులు ఏకపక్ష కాల్పుల విరమణకు స్పందించి, తక్షణమే కాల్పుల విరమణను ప్రకటించి, చర్చల ప్రక్రియను ప్రారంభించాలి. సైనిక దాడుల ద్వారా మావోయిస్టు నేతలు మరియు ఆదివాసీలను అంతమొందించాలనే ప్రయత్నం శాంతికి విరుద్ధంగా ఉంది.

అంతర్జాతీయ మానవతా విలువలను గౌరవిస్తూ, భారత ప్రభుత్వం వెంటనే, నిబంధనలేని కాల్పుల విరమణను ప్రకటించాలని, ఆపరేషస్ కాగర్ ను తక్షణమే నిలిపివేయాలని, CPI (మావోయిస్ట్)తో చర్చలు జరపాలని కోరుతున్నాం.

కవిత శ్రీవాస్తవ
+91 93515 62965
క్రాంతి చైతన్య
+91 99122 20044
డా. ఎమ్.ఎఫ్. గోపీనాథ్
+91 79935 84903

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad