బొకారో హత్యాకాండను తీవ్రంగా ఖండించండి !
భారతదేశ విప్లవోద్యమ ఒక ప్రముఖ నాయకుడు, కార్మికవర్గ ఉత్తమ పుత్రుడు కామ్రేడ్ వివేక్‌తో సహా
బొకారో హత్యాకాండలో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవాంజలి!
సమయావనధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి, ఎలాంటి షరతులు లేకుండా
శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి
రూర్ధండ్ లోని బొకారో జిల్లా, లల్పనియా పోలీస్ స్టేషన్, ముండాటోలీ-సోసో గ్రామాల సమీపంలో ఏప్రిల్ 21, 2025న జరిగిన ఒక చుట్టివేత హత్యాకాండలో భారత విప్లవోద్యమ ఒక ప్రముఖ నాయకుడు, సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ వివేక్ (ప్రయాగ్ మాంరు), మరో ఇద్దరు కామ్రేడ్స్ అవినాశ్ (అరవింద్ యాదవ్), షాజహాన్ మాంగ్సీలతో పాటు 8 మంది కామ్రేడ్స్ శత్రు బలగాలతో వీరోచితంగా పోరాడుతూ అమరులయ్యారు. భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి, అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా సోషలిజం-కమ్యూనిజాన్ని స్థాపించే లక్ష్యంతో పీడిత వర్షాల, సెక్షన్ల, జాతుల విముక్తి కోసం వారు తమ అత్యున్నతమైన ప్రాణాలను ధారపోసారు. వారి అమరత్వంతో భారతదేశ విప్లవానికి, ప్రత్యేకించి తూర్పు రీజినల్ బ్యూరో (ఈ.ఆర్.బీ.)లోని విప్లవోద్యమానికి తీవ్ర నష్టం జరిగింది. మా పార్టీ కేంద్రకమిటీ ఈ హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ అమరులందరికీ మా పార్టీ కేంద్రకమిటీ వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు అర్పిస్తూ, వారి లక్ష్యసాధనకు తుదిశ్వాస వరకు పోరాడుతామని శపథం చేస్తోంది. అమరుల కుటుంబాలకు, బంధుమిత్రులకు సంతాపాన్ని తెలుపుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగించిన బొకారో హత్యాకాండలో అమరుడైన భారత విప్లవోద్యమ ఒక ప్రముఖ నాయకుడు, కార్మికవర్గ ఉత్తమ పుత్రుడు కామ్రేడ్ వివేక్ రూర్ధండ్ లోని గిరిడీహ్ జిల్లా, పారస్ నాథ్ పర్వత ప్రాంతంలో సంథాలీ ఆదివాసీ పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పేరు ప్రయాగ్ మాంమ్సీ. వయసు 66 సంవత్సరాలు. యుక్తవయసులోకి అడుగు పెట్టకముందే ఆ ప్రాంతంలో 1971 నాటికే పెంపొందుతున్న విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు.
నక్సల్బరీ ఎర్రమంటలు భారతదేశ నలుమూలల్లోని విద్యార్థి, యువజనుల హృదయాలను జ్వలింపజేసాయి. మీరు బానిస బతుకులు బతుకుతారా లేదా సంకెళ్లను బద్దలుకొట్టి ప్రపంచాన్ని జయించేందుకు ముందుకు దూకుతారా అని నిలదీసాయి. ఇది యువ ప్రయాగ్ హృదయాన్ని జ్వలింపజేసింది. ఆయన కేవలం 13, 14 యేళ్ల వయసులోనే తన లాంటి ఎంతో మంది యువకిశోరాలతో కలిసి బానిస సంకెళ్లను తెంచుకోవాలని కలలు గంటూ ముందడుగు వేసాడు. అతి చిన్న వయసులోనే కామ్రేడ్ కన్హాయ్ చటర్జీ (కేసీ) సంబంధాల్లోకి వచ్చాడు. గతతార్మిక భౌతికవాదంతో పాటు మార్క్సిస్టు మౌలిక సిద్ధాంతాన్ని అధ్యయనం చేయనారంభించాడు. మావోయిస్టు రాజకీయాలతో మమేకమైనాడు. ఆ రాజకీయాల కోసం తన జీవితాన్ని అర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా ఆయన పార్టీలోనే విద్య అభ్యశించాడు.
కామ్రేడ్ కేసీ, కామ్రేడ్ అమూల్య సేన్, కామ్రేడ్ చంద్రశేఖర్ దాస్ ల నాయకత్వంలోని మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) పశ్చిమ బెంగాల్ లో కాంక్సా పోరాట అనుభవంతో ఉమ్మడి బిహార్ రాష్ట్రంలో గయ-హజారీబాగ్ ప్రాంతంలో విప్లవోద్యమాన్ని నిర్మించేందుకు పూనుకుంది. హజారీబాగ్ జిల్లాలోనే నేటి గిరిడీహ్ జిల్లా ఉండింది. అక్కడ క్రూరమైన భూస్వామ్య వ్యవస్థ ఉంది. ప్రత్యేక రూర్ధండ్ ఉద్యమ ప్రభావం ఉంది. ఆదివాసీ, ఆదివాసేతర ప్రజల విశాల పాత్రతో ఒక విప్లవ వెల్లువ లాంటి పరిస్థితి ఏర్పడింది. క్రూరమైన చుట్టివేత -అణచివేత క్యాంపెయిన్ తో శత్రువు ఆ వెల్లువను అణచివేయాలని ప్రయత్నించాడు. ఒకటి, రెండు సంవత్సరాల తర్వాత మరో నూతన పథకంతో శత్రు దాడిని ఓడిస్తూ, క్రమేపీ విప్లవోద్యమాన్ని విస్తరించి ఉన్నతస్థాయికి తీసుకుపోయే కృషి ఆ ప్రాంతంలో జరిగింది. గయ ప్రాంతానికి ఉద్యమం విస్తరించింది. ప్రజాసైన్యాన్ని, విముక్తి ప్రాంతాన్ని నిర్మించే లక్ష్యంతో 1976లో కామ్రేడ్ కేసీ ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో, నేతృత్వంలో బిహార్-బెంగాల్ స్పెషల్ ఏరియా కమిటీ ఏర్పడింది. దీని నాయకత్వంలో ఆ ప్రాంతంలో విప్లవోద్యమం విజయవంతంగా పురోగమించింది. కామ్రేడ్ కేసీ, కామ్రేడ్ కిషన్ దా, కామ్రేడ్ బరుణ్ దాలతో గల సన్నిహిత సంబంధాలు కలిగిన యువకిశోరం కామ్రేడ్ ప్రయాగ్ వివేక్” పేరుతో ఈ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఉద్యమం పురోగమిస్తున్న సమయంలో కామ్రేడ్స్ అమూల్య సేన్, కేసీలు కొద్ది నెలల తేడాతోనే అనారోగ్యంతో అమరులయ్యారు.
వారి అమరత్వం, వారు అందించిన ఆశయాలు, లక్ష్యాలు యువ వివేక్ మనసులో చెరిగిపోని ముద్ర వేసాయి. వారు చూపిన మార్గంలో పార్టీకీ, విప్లవోద్యమానికీ తన జీవితాన్ని అంకితం చేసారు. మరెన్నడూ వెనుదిరిగి చూడలేదు. కామ్రేడ్ బరుణ్ దా నాయకత్వంలో 1980-90 దశకాల్లో హజారీబాగ్ ప్రాంతంలో సాయుధ వ్యవసాయ విప్లవోద్యమం, ప్రత్యేక రూర్ధండ్ రాష్ట్ర ఉద్యమం అభివృద్ధి చెందాయి. వీటిలో కామ్రేడ్ వివేక్ పాత్ర చెప్పుకోదగినది. ఆనాటి బిహార్-బెంగాల్ స్పెషల్ ఏరియా కమిటీ నాయకత్వంలో ప్రజాసైన్యం, విముక్తి ప్రాంతాలను నిర్మాణం చేసే ప్రక్రియ ద్వారా సంపాదించుకున్న యావత్తు అనుభవాలను, వివిధ పోరాటాలలోని ప్రత్యేకతలను అధ్యయనం చేయడానికి, సమస్యలను పరిష్కరించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేసారు.
1990 దశాబ్దం చివరిలో పార్టీలో ఒక చిన్న అవకాశవాద “బాదల్-భరత్” ముఠా రెండు పంథాల మధ్య పోరాటం పేరుతో పార్టీ మౌలిక పంథాకు వ్యతిరేకంగా అవకాశవాద, వర్గసంకర పంథాను ముందుకు తెచ్చి అంతర్గత సంక్షోభాన్ని సృష్టించింది. ఎంసీసీ సరైన నాయకత్వం, విప్లవ ప్రజలు సమైక్యంగా విప్లవ సంకల్పంతో పోరాటాన్ని సాగించి కొద్ది కాలంలోనే ఈ ముఠాను పక్కకు నెట్టివేసారు. ఈ అంతర్గత పోరాటంలో కామ్రేడ్ వివేక్ సరైన పంథా వైపు దృఢంగా నిలబడ్డారు. పార్టీలో అంతర్గత పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్ర ఎంతో సకారాత్మకమైనది, చెప్పుకోదగినది.
ఈ క్రమంలో చారిత్రాత్మకమైన 1989, 1996 ఎంసీసీ రాష్ట్ర, కేంద్ర కాన్ఫరెన్సులు, 2001లో బిహార్-బెంగాల్ స్పెషల్ ఏరియా కాన్ఫరెన్స్ జరిగాయి. ఉద్యమ అనుభవాలను క్రోడీకరించాయి. సరైన సైద్దాంతిక, రాజకీయ, నిర్మాణ, సైనిక కృషి ద్వారా ఉద్యమం పురోగమించింది, వివిధ రాష్ట్రాలకు, రంగాలకు విస్తరించింది. ప్రజాపునాది, పార్టీ, గెరిల్లా బలగాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. బిహార్-రూర్ధండ్ ప్రాంతంలో కామ్రేడ్ వివేక్ ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు. సబ్ జోన్, జోన్, స్పెషల్ ఏరియా స్థాయిలలో అంచలంచెలుగా ఆయన బాధ్యతలు చేపట్టి ఉద్యమ పురోగమనంలో తన వంతు పాత్ర నిర్వహించారు. కేంద్రకమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు.
విప్లవకారుల ఐక్యత గురించి కామ్రేడ్ కన్హాయ్ చటర్జీ చెప్పిన విషయాలు కామ్రేడ్ వివేక్ ఎన్నడూ మరిచిపోలేదు. వివిధ ఎం-ఎల్ గ్రూపులతో ఐక్యమయ్యేందుకు ఆయన ఉత్సుకతతో ఉండేవారు. కామ్రేడ్ కిషన్ దా నాయకత్వంలో 2001లో కేంద్రకమిటీ నిర్వహించిన సైద్ధాంతిక కృషితో పార్టీ అవగాహనలోనూ, ఆచరణలోనూ ఒక గెంతు తీసుకున్నది. సీపీఐ (ఎం-ఎల్) [పీపుల్స్ వార్]తో ఘర్షణల నివారణ, పార్టీ ఐక్యత, పిడివాద, సెక్టేరియన్ వైఖరులను వదులుకోవడం, ప్రజాసైన్య నిర్మాణం-ప్రజాయుద్ధ అభివృద్ధి-విముక్తి ప్రాంతాల ఏర్పాటు విషయంలో ఒక బ్రేక్ త్రూ సాధించడానికి సానుకూల పరిస్థితి ఏర్పడింది. విప్లవకారుల ఐక్యతా క్రమం వేగం పుంజుకుని కొన్ని నిజమైన ఎం-ఎల్ గ్రూపులను, శక్తులను ఐక్యం చేసుకుని ఎంసీసీ అఖిల భారత పార్టీగా ఎంసీసీఐగా ఎదిగింది. 2003 ఏప్రిల్ 22న పీ.ఎల్.జీ.ఏ.ను స్థాపించింది. ఈ క్రమంలోనే రెండు ప్రధాన విప్లవ ప్రవంతులుగా వున్న ఎంసీసీఐ, సీపీఐ (ఎం-ఎల్) [పీపుల్స్ వార్]లు విలీనమై నూతన పార్టీ సీపీఐ (మావోయిస్టు) ఆవిర్భంచింది. పార్టీ ఐక్యతా కృషిలో కేంద్రకమిటీ సభ్యునిగా కామ్రేడ్ వివేక్ తన వంతు బాధ్యత నిర్వహించారు. బిహార్-రూర్ధండ్ లో అన్ని స్థాయిల్లో రెండు పార్టీలను ఐక్యం చేయడంలో విజయవంతంగా కృషి చేసారు. 2009లో బిహార్ -రూర్ధండ్ స్పెషల్ ఏరియా కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు.
కామ్రేడ్ వివేక్ 2007 ఐక్యతా కాంగ్రెస్-9వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విప్లవ ప్రజాసంఘాలను, విప్లవ ప్రజా కమిటీ (ఆర్.పీ.సీ.)లను, వర్ణ పోరాటాన్ని, ప్రజా ఉద్యమాలను అభివృద్ధి చేయడంలో చొరవగా కృషి చేసారు. విప్లవ ప్రతిఘాతుక ‘సేంద్ర”, ‘నాగరిక్ సురక్షా సమితి” వంటి శ్వేత మిలిషియాలను ప్రజలను, ప్రజా మిలిషియాను సమీకరించడం ద్వారా తిప్పికొట్టడంలో ముందున్నారు. 2012 నుంచి విప్లవోద్యమం గడ్డు స్థితిని ఎదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత 2018లో తాత్కాలికంగా వెనకంజ వేసినప్పటికీ ఆ ప్రతికూల పరిస్థితిల్లో సైతం కామ్రేడ్ వివేక్ గుండెనిబ్బరంతో దృఢసంకల్పంతో పని చేసారు. విప్లవోద్యమాన్ని, పార్టీ, పీ.ఎల్.జీ.ఏ.లను కాపాడుకుంటూ వర్గ పోరాటాలను, ప్రజా ఉద్యమాలను పునర్నిర్మాణం చేసేందుకు కృషి చేసారు. వ్యూహాత్మక “ఆపరేషన్ గ్రీన్ హంట్”, ‘సమాధాన్”, “సూరజ్ కుండ్”, ఇందులో భాగంగా ప్రస్తుత “ఆపరేషన్ కగార్’ పేరుతో భారతదేశ దళారీ పాలకవర్గాలు విప్లవోద్యమాన్ని నిర్మూలించే దుష్ట లక్ష్యంతో నిరంతరాయంగా సాగిస్తున్న దాడులను తిప్పికొడుతూ ప్రజలను, పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, యుద్ధ రంగాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. శత్రుదాడిలో అనేక మంది కామ్రేడ్స్ అమరులయ్యారు, చాలా మంది శత్రు చేత జిక్కి జైలు పాలయ్యారు. కొంతమంది ద్రోహులుగా మారి ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారు. కామ్రేడ్ వివేక్ జీవన సహచరి కామ్రేడ్ చింతా (జయ) అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో గత సంవత్సరం అక్టోబర్ నెలలో పోలీసులు అరెస్టు చేసి సరైన చికిత్స అందించకుండా హత్య చేసారు. ఇలా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా శత్రు దాడులను తిప్పికొడుతూ, ఉద్యమంలో చివరి ఊపిరి వరకూ శక్తివంచన లేకుండా కృషి చేసిన ప్రజాయుద్ధ నాయకుడు కామ్రేడ్ వివేక్.
విప్లవోద్యమంలో దాదాపు 4, 5 దశాబ్దాల అనుభవం కలిగిన కామ్రేడ్ వివేక్ కార్మికవర్గ దృక్పథంతో పని చేస్తూ ప్రజల, పార్టీ విశ్వాసాన్ని చూరగొన్న నిజమైన కమ్యూనిస్టు. ఆయన సదా కోపానికి, అహంభావానికి దూరంగా ఉండేవారు. చాలా సాదా-సీదా జీవనశైలి ఆయనది. ఆయన వేషభాషలు సాధారణంగా ఉండేవి. ఆయన నిస్వార్థత, త్యాగశీలతలతో పీడిత ప్రజలకు, విప్లవోద్యమానికీ ఆయన సేవ చేసారు. కామ్రేడ్ వివేక్ ప్రదర్శించిన ఉన్నత కమ్యూనిస్టు ఆదర్శాలు యావత్తు కమ్యూనిస్టు విప్లవకారులకు ప్రేరణగా నిలుస్తాయి. ఇలాంటి వేలాది అమరుల ఆదర్శాలను అలవరచుకుంటూ వారు కన్న కలల్ని సాకారం చేసేందుకు కృషి చేయడమే వారికి మనమివ్వగల నిజమైన నివాళి.
+
అభయ్,
అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ,
భాకపా (మావోయిస్టు)