Menu

కేంద్రం దండకారణ్యంలో మారణకాండను తక్షణం ఆపేయాలి – మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్

anadmin 6 months ago 0 468

—-దండకారణ్యంలో ఎన్కౌంటర్ లను ఆపాలి
—-మావోయిస్టు లతో చర్చలు జరపాలి
—-ఇరు దేశాల మధ్య చర్చలతో హింసకు స్వస్తిపలుకు తున్నప్పుడు తమ దేశ పొరులతో చర్చలు చేస్తే తప్పేంటి?
—-తెలుగు బిడ్డలను పిట్టల్లా కాల్చుతుంటే రెండు ప్రభుత్వాలు పట్టించుకోవా?
మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్.

దండకారణ్యంలో కొన్ని నెలలుగా సాగుతున్న మారణకాండ ఆగాలంటే చర్చలే పరిష్కారం అని సీనియర్ జర్నలిస్ట్,మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ అన్నారు. ఆయుధాలతో సంచరిస్తున్నారనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలు తీసేహక్కు పోలీస్ బలగాలకు లేదన్నారు. విదేశీ శక్తులు దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తే వారి జాడనునుకనిపెట్టి వారిపై దాడికి ప్రయోగించే డ్రోన్ లను శాటిలైట్ గన్ , రోబో డేగలను మన పొరుల మీదే ఉపయోగించడం, దారుణంగా మట్టుబెట్టడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. రెండు నెలల్లోనే వందల మంది ఎన్కౌంటర్ లో చనిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ గా 25 ఏళ్ళు పనిచేసిన మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ లో, నక్సల్స్ వార్తల సేకరణలో బాగా అనుభవం ఉండి గతంలో నక్సల్స్ తో చర్చల సమయంలో కూడా క్రియాశీలకంగా పనిచేసిన అనుభవంతో మీడియాతో తన అభిప్రాయాలను పంచున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నక్సల్స్ ని నిర్మూలించేకంటే అదే టెక్నాలజీ ఉపయోగించి దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించాలని అదే టెక్నాలజీ ఉపయోగించి దేశ సంపద దోచుకుంటున్న వారిని, ప్రజలను దోచుకుంటున్న వారిని నిర్మూలించాలని అలా చేస్తే భవిష్యత్తు లో నక్సలైట్ల ఉనికి ఉండకపోవచ్చు కదా అని ఆయన అన్నారు. సమస్య మూలాల ను పరిష్కరించే బాద్యతను వదిలి విచక్షణారహితంగా కాల్పులు జరిపి చనిపోయిన వారి శవాలను ఇలా కుప్పలుకుప్పలుగా పంపించడం అమానవీయమని, రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఈ మారణకాండలో వేలాది మంది అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్టు వార్తల్లో చూస్తున్నాం అందుకే మావోయిస్టు లను చర్చలకు పిలవాలని ఈ నరమేధానికి ముగింపు పలకాలని క్రాంతి కిరణ్ కోరారు. దేశాల మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది చనియేయినప్పటికి ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాలు చర్చల ద్వారా కాల్పుల విరమణ చేసి హింసకు స్వస్తిపలుకుతున్న పరిస్థితి మన కళ్లముందర కనిపిస్తున్న తరుణంలో తమ దేశ బిడ్డలతో చర్చలు జరపడానికి మన ప్రభుత్వాలు ఎందుకు ముందుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చొరవ చూపి కాల్పుల విరమణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad