Menu

కస్టడీలో రాజకీయ ఖైదీలను చిత్రహింసలపాలు చేసిన NIA

anadmin 7 months ago 0 185

కస్టడీలో NIA అధికారులు తమను అనేకరకాల చిత్రహింసలకు గురి చేశారని మావోయిస్టు రాజకీయ ఖైదీలు C.P.మొయితీన్, సోమన్, మనోజ్ లు పిర్యాదు చేశారు. ఈ ముగ్గురిని కోర్టు ద్వారా జనవరి ఒకటవ తేదీ నుంచి ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న NIA అధికారులు ఒక రోజు ముందుగానే కొచ్చి NIA కోర్టులో వారిని హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురు రాజకీయ ఖైదీలు, NIA అధికారులు తమను భౌతికంగా చిత్రహింసల పెట్టారని జడ్జికి పిర్యాదు చేశారు.

కాగా, మావోయిస్టు ఖైదీలపై NIA అధికారులు చేసిన దాడిని కేరళకు చెందిన హక్కుల సంఘం నాయకుడు రషీద్ సీపీ చెరుకోపల్లి తీవ్రంగా ఖండించారు. NIA ప్రజా కార్యకర్తలపై చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. NIA పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు, మీడియాకు బహిర్గతం చేయాలని ఆయన కోరారు.
కస్టడీలో ఉన్న ఖైదీలపై దాడి చేసి చట్టాన్ని ఉల్లంఘించిన ఎన్‌ఐఏ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రషీద్ డిమాండ్ చేశారు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad