వైద్యపరమైన కారణాలపై PFI మాజీ చైర్మన్ E. అబూబకర్, హక్కుల కార్యకర్త A.S ఇస్మాయిల్ ని తక్షణమే విడుదల చేయాలని రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (CAMPAIGN AGAINST STATE REPRESSION)( CASR) డిమాండ్ చేస్తున్నది..
సీనియర్ ముస్లిం నాయకులు E. అబూబకర్, A.S ఇస్మాయిల్ క్రూరమైన UAPA ఆరోపణలతో గత రెండేళ్లకు పైగా తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఇద్దరు కార్యకర్తలు తీవ్రమైన ఆరోగ్య రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. వీరికి వైద్యపరమైన కారణాలతో బెయిల్ మంజూరు చేయడంలో న్యాయవ్యవస్థ మళ్లీ విఫలమైంది. అంతేకాకుండా వీరికి ప్రాథమిక వైద్య చికిత్సను కూడా అధికారులు తిరస్కరించారు. జీవించే ప్రాథమిక హక్కును పూర్తిగా ఉల్లంఘించారు.
ఈ నెలలో, A.S ఇస్మాయిల్ తీహార్ సెంట్రల్ జైలులో ప్రాణాంతక హెమరేజ్ స్ట్రోక్ తో పక్షవాతానికి గురయ్యాడు. అతని కుడి వైపున శరీర భాగం పూర్తిగా పక్షవాతం వచ్చింది. మొదట్లో స్ట్రోక్, పక్షవాతంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అతన్ని ఆసుపత్రి నుండి బలవంతంగా డిశ్చార్జ్ చేసి తిరిగి తీహార్ జైలుకు తీసుకెళ్ళారు. ఇస్మాయిల్ కు శరీర కదలిక లేదు. స్పర్ష లేదు., నమలడం, మ్రింగటం చేయలేకపోతున్నాడు. మాట్లాడలేకపోతున్నాడు. అతని ఆలోచన, జ్ఞాపకశక్తి, కంటి చూపులు పూర్తిగా ప్రభావితమైనవి. స్ట్రోక్ ప్రభావం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కుడి వైపున పక్షవాతం కూడా తీవ్రమైంది. ఇస్మాయిల్ తనకు తాను ఏ పని కూడా చేసుకునే స్థితిలో లేడు. ఈ స్థితిలో సరైన వైద్యం అందక జైలులో మగ్గుతున్నాడు.
అబూబకర్, 72 ఏళ్ల రిటైర్డ్ స్కూల్ టీచర్, జర్నలిస్ట్. సామాజిక కార్యకర్త. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్నది. అబూబకర్ పార్కిన్సన్స్ వ్యాధి, మధుమేహంతో పాటు రక్తపోటు, చూపు కోల్పోవడం వంటి అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయనకు అరుదైన ప్రాణాంతక క్యాన్సర్ ‘గ్యాస్ట్రోఎసోఫాగల్ జంక్షన్ అడెనోకార్సినోమా’ ఉందని 2019 లో బైటపడిన తర్వాత జనవరి 2020లో కీమోథెరపీ, సర్జరీ చేయించుకున్నప్పటికీ అతని ఆరోగ్యం మెరుగు పడలేదు. కస్టడీలో ఉన్నప్పుడు ఆయన స్నానంతో సహా ఇతర దిన చర్యలను సాగించడానికి కూడా సహాయకుడు అవసరం. కానీ అబూబకర్ పరిస్థితిని కోర్టులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా కనీసం బెయిల్ కూడా మంజూరు చేయలేదు.
అబూబకర్ అరెస్టు అయినప్పటి నుండి ఢిల్లీలోని AIIMS తో సహా ఇతర ఆసుపత్రులకు ఆయనను తీసుకెళ్ళారు. తరచుగా జైలు ఆసుపత్రిలో కూడా ఉంచుతున్నారు. అయితే అలా ఊరికే తీసుకెళ్ళి వాపసు తేవడం కాకుండా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ AIIMSలో వైద్య చికిత్స కోసం అబూబకర్‌ను చేర్చుకోవాలని ట్రయల్ కోర్టు ఆదేశించినప్పటికీ ఆయనను AIIMSలో చేర్చలేదు. కస్టడీలో అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూనే ఉంది.
ఇద్దరి కార్యకర్తల ఆరోగ్య పరిస్థితి పట్ల స్పష్టంగా జైలు అధికారులు, న్యాయవ్యవస్థ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జైలు అధికారులు, న్యాయవ్యవస్థలో ఇలాంటి నిర్లక్ష్యం కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఫాదర్ స్టాన్ స్వామి, పాండు నరోటే, జి.ఎన్.సాయిబాబాలను ఈ హిందుత్వ ఫాసిస్ట్ రాజ్యం ఎలా చంపిందో మనందరికీ తెలుసు. ఫాదర్ స్టాన్ స్వామి సిప్పర్ వంటి ప్రాథమికమైన వాటి కోసం పోరాడవలసి వచ్చింది. సాయిబాబా తన వీల్‌చైర్ కోసం, ప్రాథమిక మందుల కోసం కూడా పోరాడాల్సి వచ్చింది. పాండు నరోటేను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా మరణించాడు. కరడుగట్టిన నేరస్థులు, రేపిస్టులు, హిందూత్వ ఫాసిస్టులకు ప్రతి సారీ, ప్రతి సాకుతో బెయిల్, పెరోల్ మంజూరు చేస్తారు. ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్న వారు “లా అండ్ ఆర్డర్” అనే కథనం కిందనే కష్టాలను అనుభవిస్తున్నారు. అణచివేతదారులు, దోపిడీదారులకు అనుకూలంగా చట్టం ఎలా పనిచేస్తుందో ఇది స్పష్టంగా సూచిస్తుంది. పాండు నరోటే, స్టాన్ స్వామి, జి.ఎన్. సాయిబాబా లాగా మళ్ళీ మరొకరు మరణించడాన్ని అణగారిన, దోపిడీకి గురైన ప్రజలు సహించరు.
రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం ( CASR) ఈ ఇద్దరు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. ప్రజాస్వామ్య, ప్రగతిశీల హక్కుల సంస్థలు, వ్యక్తులు కలిసి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.
E. అబూబకర్, A.S.ఇస్మాయిల్ LAను వెంటనే విడుదల చేయాలి!
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయలి!
NIA , UAPAలను రద్దు చేయాలి !
CAMPAIGN AGAINST STATE REPRESSION
Organizing Team
(AIRSO,AISA, AISF, APCR,ASA,BAPSA BBAU,BASF, BSM, Bhim Army, bsCEM, CEM,COLLECTIVE,CRPP, CSM CTF, DISSC, DSU, DTF, Forum Against Repression Telangana, Fraternity, IAPL, Innocence Network, Karnataka Janashakti, LAA, Mazdoor Adhikar Sangathan, Mazdoor Patrika, NAPM, NAZARIYA , Nishant Natya Manch, Nowruz, NTUI, People’s Watch, Rihai Manch, Samajwadi Janparishad, Samajwadi Lok Manch, Bahujan Samjavadi Manch, United Peace Alliance, WSS,Y4S)