Menu

చత్తీస్ గడ్, తెలంగాణ ఎన్ కౌంటర్లపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

anadmin 11 months ago 0 263

చత్తీస్ గడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా ఆండ్రి గ్రామంలో 2024 సెప్టెంబర్ 03వ తేదీన ఇన్ ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ వందలాది పోలీసు బలగాలు, పిఎల్జీఏ వున్న మాకాంను చుట్టి ముట్టి జరిపిన కాల్పుల్లో 9 మంది అమూల్యమైన కామ్రేడ్స్ అమరులైన విషయం ప్రజలందరికి తెలిసిందే. ఈ ఘటనలో కా.ఏసోబు కూడా అమరుడయ్యాడు. తన అమరత్వం సమాచారం తెలుసుకున్న పీడిత ప్రజలు, అభిమానులు, బంధు మిత్రులు కడసారి చూసుకోవడానికి తరలి వచ్చారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, టేకుల గూడెం గ్రామానికి వేలాదిగా కదిలి వచ్చిన ప్రజలు తమ నాయకుని అంతిమ యాత్రలో పాల్గొని భావేద్వేగంతో ఊరేగింపుగా సాగారు. పిడికిళ్ళు ఎత్తి అమర వీరుడి ఆశయాలను కొనసాగిస్తామంటూ శపథం చేసిన జనం కడసారి చెయి కలిపి రణధీరుడికి భౌతికంగా విడ్కోలు పలికారు.

సెప్టెంబర్ 05వ తేదీన కా.ఏసోబు అంతిమ యాత్ర కొనసాగుతుండగానే మరో విషాద వార్త వినబడింది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో కాంగ్రేస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధ పాలెం అటవిలో ఆరుగురి విప్లవకారులున్న మాకాంను గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుమట్టి విచక్షణా రహిత కాల్పులతో నిస్వార్థంతో ప్రజా సేవా చేస్తున్న అమూల్యమైన కామ్రేడ్స్ లచ్చన్న(డివిసిఎం), తులసీ(ఏసిఎం),రాము(ఏసిఎం),కోసి(పిఎం),గంగాల్(పిఎం)లను హత్య చేశారు. వందలాదిగా చుట్టుముట్టిన గ్రేహైండ్స్ బలగాల చుట్టివేత దాడిని ఆరుగురు వీర గెరిల్లాలు విరోచితంగా పోరాడి ముగ్గురి పోలీసులను తీవ్రంగా గాయ పరిచి ప్రాణాలర్పించిన వీర యోధులకు రెడ్ సెల్యూట్. ఈ సందర్భంగా వారికి వినమ్రంగా తలవంచి జోహర్లు అర్పిస్తున్నాం.

శతృవు తూటాలకు భయపడకుండా విరోచితంగా పోరాడి ఆండ్రి గ్రామం వద్ద ప్రాణాలర్పించిన కా. ఏసోబు, రఘునాదపాలెం గ్రామం వద్ద కా.లచ్చన్న, కా.తులసీ, కా.రాము, కా. కోసి, కా. గంగాల్, కా. దుర్గేష్ లకు కన్నీటి నివాళి అర్పిస్తున్నాం. పీడిత ప్రజల ప్రియతమ నేతల కుటుంబ సభ్యులకు, బంధు, మిత్రులకు, సమకాలికులకు మా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారి అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజలందరికి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రజా విముక్తి కోసం జంగ్ సైరన్ ఊదిన వీర యోధుల ఆశయాలను సాధించడానికి తుది వరకు పోరాడుతామని శపథం చేస్తున్నాం. అమరుల కలలను సాకారం చేసి వారికి నిజమైన నివాళి అర్పిద్దాం.

కేవలం సామ్రజ్యవాదుల, దేశ, విదేశీ కార్పోరేట్ల, దోపిడి పాలకుల స్వంత లాభాల కోసం మాత్రమే భారత దేశంలో మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో నేడు ఈ నరమేధం కొనసాగుతుంది. కేంద్రంలో బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు బీజేపి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో వుండి దేశ సంపదను, శ్రమను కారు చౌకగా అమ్మడానికి దోపిడి అనుకూల విధానాలు సరళం చేస్తున్నాయి. దేశ వనరులను, శ్రమను కాపాడే లక్ష్మంతో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో పీడిత ప్రజలు పోరాడుతున్నారు. ఈ ప్రజా పోరాటాలు వారి స్వంత లాభాలకు అడ్డుగా మారడంతో మావోయిస్టు పార్టీని, పీడిత ప్రజలను నిర్మూలించాలని పథకం పన్నారు. దోపిడి వర్గాలు తమ ఆర్థిక సంక్షోభాలను లేదా తమ మార్కెట్ విస్తరణను యద్ధం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలనుకుంటారు. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తున్నాయి. సామ్రాజ్యవాదులకు, కార్పోరేట్లకు దోచిపెట్టడంలో, మావోయిస్టు పార్టీని నిర్మూలించడంలో బీజేపి, కాంగ్రేస్ లు వేరు వేరు కాదు. రెండు ముఖాలు కలిగిన ఒకే రూపం మాత్రమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి సాయుధ బలగాల మద్దతుతో పాటు ఆర్థిక మద్దతు కావాలని కోరారు. ఆనాటి నుండి కాంగ్రేస్ మావోయిస్టు పార్టీపై నిర్భంధాన్ని పెంచింది. కాంగ్రేస్ అధికారంలోకి వచ్చిన నుండి 2024 ఏప్రిల్ 6వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురం మండలం అడవుల్లో కా.అన్నే సంతోష్ సహా ముగ్గురి సహచరులను గ్రేహౌండ్స్ బలగాలతో హత్య చేయించింది. జూలై 25వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామేర తోగు అడవుల్లో కా. విజెందర్ (అశోక్ )ను హత్య చేసింది. సెప్టెంబర్ 5వ తేదీన రఘునాధం పల్లి గ్రామం వద్ద మరో ఘటనలో ఆరుగుర్ని కౄరంగా చంపింది. అధికారంలోకి వచ్చిన నుండే కాంగ్రేస్ పార్టీ తెలంగాణలో నెత్తుటి ఏరులు పారిస్తుంది.

ప్రజా పాలన పేరు చెప్పి నరహంతక పాలన కొనసాగిస్తుంది. రఘునాదపాలెం ఎన్ కౌంటర్ కు కాంగ్రేస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి. కాంగ్రేస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. తెలంగానలో కాంగ్రేస్ ప్రభుత్వం చేస్తున్న ఎన్ కౌంటర్లను ప్రజలు ప్రజా స్వామిక వాదులు తీవ్రంగా ఖండించండి.

కా.ఏసోబు దళిత పేద కుటుంబంలో జన్మించాడు. పేదరికాన్ని అనుభవించిన కా.ఏసోబు కుటుంబం గడువడానికి ఒక భూస్వామికి పాలేరుగా పని చేశాడు. ఎంత కష్టించినా కుటుంబ గడువకపోవడంతో 1978లో విప్లవ రైతు కూలీ సంఘంలో చేరి భూస్వాములపై తిరుగుబాటు చేశాడు. 1991 వరకు రైతుకూలీ సంఘంలో పని చేస్తూ అనేక భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలకు నాయక్త్యం వహించి కరడుగట్టిన భూస్వాములను గ్రామాల నుండి తరిమి పేదలకు భూములు పంచాడు. 1991లో పూర్తికాలం విప్లవకారుడుగా సీపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ లో చేరాడు. వరంగల్ జిల్లాలో కా.ఏసోబు భూస్వాముల పాలిట సింహా స్వప్నమయ్యాడు. మైదాన ప్రాంత ఉద్యమాలను విస్తరింప చేయడానికి గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేశాడు. 2023లో దండకారణ్యానికి వెళ్ళి జనతన సర్కార్ల నాయకత్వంలో వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేశాడు. 46 సంవత్సరాల తన విప్లవోద్యమంలో ఏనాడు రాజీలేకుండా ఉద్యమించాడు. 70 సంవత్సరాల వయస్సులో కూడా దృఢంగా మొక్కవోనీ దీక్షతో నిలబడ్డాడు.
రఘునాధ పాలెంలో ప్రాణాలర్పించిన యువతీ యువకులంతా ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. ఆదివాసీ ప్రాంతాలలో సామ్రాజ్యవాదులు ఆదివాసీలను తరిమేసి ఇక్కడ వనరులను దోచుకోవడాన్ని వ్యతిరేకించి జల్, జంగల్, జమీన్ కోసం రాజకీయాధికారం కోసం తుపాకీ పట్టిన వారే. కా.కుంజం వీరయ్య 20 సంవత్సరాలకు పైగా విప్లవోద్యమంలో పని చేశాడు. ఆటుపోట్లు ఎన్ని ఎదురైన వెనకడుగు వేయలేదు. తెలంగాణలో విప్లవోద్యమాన్ని పునర్ నిర్మించడానికి చాలా కష్ట పడ్డాడు. ఆ కృషిని భరించలేని పాలకులు తనను హత్య చేయాలని కుట్ర పన్నారు. కా.తులసి దాదాపు 15 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పని చేస్తుంది. విప్లవోద్యమానికి అనేక ప్రతికూలతలు వున్నప్పటికీ వెనకడుగు వేయలేదు. విప్లవోద్యమానికి అనుకూలతలు సృష్టించడానికి మరింత ధైర్యంగా ముందుకు కదిలిన వీర వనిత.కా.రాము, కా.దుర్గేష్ పది సంవత్సరాలకు పైగా విప్లవోద్యమాన్ని అంటిపెట్టుకొని వున్నారు. కా.కోసి, కా. గంగాలు రెండు సంవత్సరాలుగా విప్లవోద్యమంలో కొనసాగుతున్నారు.
నిస్వార్ధంగా మహోన్నత లక్ష్యం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన వీర యోధులకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నాము.

జగన్,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad