జూలై 28నుంచి ఆగస్టు 3, 2024 మధ్య “అమరవీరుల స్మారక వారోత్సవం” సందర్భంగా, మేము భారత విప్లవకారులకు లాల్ సలామ్ తెలియజేస్తున్నాము. వర్గరహిత, దోపిడీ రహిత, స్వేచ్ఛా భవిష్యత్తు కోసం పాటు పడిన మన అమరవీరులకు గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాము.
భారతదేశ కార్మికులు, రైతులు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA), CPI (మావోయిస్ట్) యోధులు మరిన్ని విప్లవాత్మక విజయాలను జరుపుకోవాలని TKP-ML కోరుకుంటోంది.
భారతదేశంలో పీపుల్స్ వార్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఎదురయ్యే ఇబ్బందులు, అడ్డంకులను అధిగమించడానికి సిపిఐ (మావోయిస్ట్) చేస్తున్న పోరాటాలు,సంకల్పం నుండి మా పార్టీ ప్రేరణ పొందింది. మా పార్టీ మాత్రమే కాదు, ముఖ్యంగా టర్కీలో, మధ్యప్రాచ్యంలోని అన్ని ప్రగతిశీల, విప్లవాత్మక శక్తులు భారత విప్లవ పోరాటంలోని అన్ని పరిణామాలను అనుసరిస్తున్నాయి. భారత పాలక వర్గాల క్రూరమైన దాడులను ప్రతిఘటించడానికి CPI (మావోయిస్ట్) పోరాటాన్ని ఎలా నడిపిస్తోంది అనే విషయాన్ని మేము గమనిస్తున్నాము. భారత విప్లవాన్ని అణిచివేయడానికి ఫాసిస్ట్ మోడీ సాగిస్తున్న కగార్ ను CPI (మావోయిస్ట్) విఫలం చేస్తున్న విధానాలతో మా ప్రాంతంలోని అన్ని విప్లవ శక్తులు ప్రేరణ పొందాయి.
గత సంవత్సరం, న్యూ డెమోక్రటిక్ రివల్యూషన్, సోషలిజం, కమ్యూనిజం కోసం భారతీయ ప్రజల పోరాటంలో అమరులైన 400 మంది సహచరులకు మేము అమర వీడ్కోలు పలుకుతున్నాము. ఈ కామ్రేడ్లలో 56 మంది మహిళా సహచరులు, రైతు మహిళలు ఉన్నారు.
సీపీఐ(మావోయిస్ట్) నేతృత్వంలోని భారత ప్రజల ప్రజాపోరాటాన్ని అణిచివేసేందుకు ఫాసిస్ట్ మోదీ పాలన ‘ఆపరేషన్ కాగర్’ పేరుతో కొత్త ప్రమాదకర యుద్దాన్ని ప్రారంభించింది. సీపీఐ(మావోయిస్ట్) నేతృత్వంలోని ఈ ప్రతి ఘాతక విప్లవ దాడిని భారత ప్రజలు ఓడించడం ఖాయం. ఎందుకంటే భారత ప్రజల పోరాటం న్యాయబద్ధమైనది.ధర్మబద్ధమైనది. ఇది భవిష్యత్తును సూచిస్తుంది.
సామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు తీవ్రరూపం దాల్చి, కొత్త సామ్రాజ్యవాద విభజన యుద్ధం (మూడవ ప్రపంచయుద్ధం) రావచ్చన్న సూచనల నేపథ్యంలో, CPI (మావోయిస్టు) నాయకత్వంలో భారత ప్రజా యుద్దం ప్రపంచ శ్రామిక వర్గానికి స్ఫూర్తినిస్తూనే ఉంది.
మేము మరోసారి భారత ప్రజా యుద్దం, న్యూ డెమోక్రటిక్ రివల్యూషన్, సోషలిజం, కమ్యూనిజం కోసం పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మన అమరవీరులకు టర్కిష్ వర్కర్స్ అండ్ పీజెంట్స్ లిబరేషన్ ఆర్మీ (TİKKO), ఉమెన్స్ కమ్యూనిస్ట్ యూనియన్ (KKB), మా కొమ్సోమోల్ సంస్థ, టర్కిష్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ యూత్ యూనియన్ (TMLGB), మా పార్టీ TKP-ML రెడ్ శెల్యూట్స్ తెలియజేస్తున్నది.
అమరవీరులకు లాల్ సలామ్
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) వర్ధిల్లాలి
లాంగ్ లైవ్ శ్రామికవర్గ అంతర్జాతీయవాదం వర్ధిల్లాలి
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ టర్కియే మార్క్సిస్ట్-లెనినిస్ట్,
ఇంటర్నేషనల్ బ్యూరో
(TKP-ML EB)