Menu

ఆ ముగ్గురి ప్రాణానికి ఎలాంటి హాని జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్య‌త వహించాలి-మావోయిస్టు పార్టీ

anadmin 1 year ago 0 238

జైసింగ్, రమేష్, సుక్కి అనే ముగ్గురిని పోలీసులు పట్టుకెళ్ళి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, ఆ ముగ్గురిని ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఏటూరు నాగారం-మహదేవపూర్ దళంలోని నిరాయుధులైన సభ్యులు జై సింగ్, రమేష్ లను నిన్న, సుక్కిని ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలో పట్టుకొని వెళ్ళారని వారిని కోర్టులో హాజరు పర్చాలని మావోయిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, పెద్దపల్లి (JMWP) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేసిన ఆయన వారికి ఎలాంటి హాని జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్య‌త వహించాలని హెచ్చరించారు.ఈ అక్రమ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధి జీవులందరూ వ్యతిరేకించాలని కోరారు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad