Menu

పౌర హక్కుల నాయకుడు తాళ్ళ పల్లి లక్షన్న కు జోహార్లు!

anadmin 1 year ago 0 61

పౌర హక్కుల నాయకుడు తాళ్ళ పల్లి లక్షన్న కు జోహార్లు…. పౌర హక్కుల సంఘం,తెలంగాణ……
30.5..2024 నాడు హెర్పెస్ జోస్టర్ వైరస్ అట్టక్ అయినతరువాత లక్షన్న ఆరోగ్యం ఒక్కసారే క్షీణించింది..ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అన్నకు అలవాటు…కానీ వైరల్ ఎటాక్ కావడం వలన 10.6.2024 నాడు నిమ్స్ లో జాయిన్ అయ్యి అప్పడినుంది అక్కడే చికిత్సలో ఉన్నాడు .రోజు రోజుకు ప్లేట్ లెట్స్ పడిపోవడం ,బోన్ మారో లో రక్తం ఉత్పత్తి ఆగిపోవడంతో ఎన్ని యూనిట్ల రక్తం, ప్లేట్ లెట్స్ ఎక్కించినా ఆరోగ్యం కుదుట పడలేదు .చివరికి ఈ రోజు 15 జూలై,2024 సాయంత్రం 4.30 కి తన చివరి శ్వాస వదిలాడు లక్ష్మణ్ .

గత మూడు దశాబ్దాలుగా పౌర హక్కుల సంఘం హైదరాబాదు యూనిట్ లో ఎంతో క్రియాశీలక గా పని చేసిన తాళ్ళ పల్లి లక్ష్మణ్ స్వగ్రామం ఆలేరు దగ్గర…అత్యంత పేద దళిత కుటుంబంలో పుట్టిన్ లక్ష్మణ్ ఉస్మానియా యూనివర్సిటీలో LLB,,,తరువాత LLM చేసినారు..కష్టాన్ని నమ్ముకున్న లక్ష్మణ్ న్యాయవాద వృత్తి తో పాటు కుటుంబ భాధ్యత నిర్వహించారు..ఎనిమిది సంవత్సరాల కింద నోటరీ ని తెచ్చుకొని సికింద్రాబాద్ కోర్టు వద్ద నోటరీలు చేస్తూ తన జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. లక్ష్మణ్ అన్నకు ఒక కూతురు ప్రస్తుతం పీజీ పూర్తిచేసి పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందుతున్నది…లక్ష్మణ్ అన్న 1995 నుండి JACDR నుండి పౌర హక్కుల సంఘంలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు..ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి నిర్బంధంలో సహితం సంఘాన్ని ఏ రోజు నిర్లక్ష్యం చేయని హక్కుల కార్య కర్త. గత మూడు మహాసభలకు సంబంధించి హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్ష పదవిని తన శక్తి మేరకు పని చేసినవారు లక్ష్మణ్ ఉద్యమాలంటే ప్రాణం…తన ఎదురుగా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు.తన ఇంటి ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక గూండాలు ఆక్రమిస్తే సహించక వారిని ఒక్కడై ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో 18.2.24 నాడు ఆ గూండాలు లక్ష్మణ్ పైన భౌతిక దాడి చేసినా వెనకడుగు వేయలేదు..హైదరాబాద్లో CLC ఏ కార్యక్రమం చేసినా తన బాధ్యతను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు…..ప్రజాస్వామికఉద్యమాల మరియు హకుల ఉద్యమం తరపున లక్ష్మణ్ కు పౌర హక్కుల సంఘం తెలంగాణ వినమ్ర నివాళులర్పిస్తుంది….లక్ష్మణ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలుపుతోనే తోటి న్యాయవాదులను,హక్కుల సంఘాల సానుభూతి పరులను
అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

తాళ్లపెల్లి లక్ష్మణ్
+916302739231
మిత్రులు పై నంబర్ కి పంపిస్తే లక్ష్మణ్ కుటుంబానికే చేరుతుంది.
స హా యం చేయవలసిందిగా తెలంగాణ అధ్యక్ష,కార్యదర్శులుగా విజ్ఞప్తి చేస్తున్నాం.
‍లక్ష్మణ్ గడ్డం
‍నారాయణరావు

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad